ప్రజలకు సత్వర సేవలు అందించే విధంగా కృషి చేస్తానని వరంగల్ నగర నూతన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. హన్మకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇన్ఛార్జ్గా ఉన్న ప్రమోద్ కుమార్ నుంచి తరుణ్ జోషి బాధ్యతలు స్వీకరించారు.
'మావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా ' - Warangal Urban District News
జిల్లాలో ప్రశాంత వాతావరణం కోసం కృషి చేస్తానని వరంగల్ నగర నూతన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్టాలు ఉండటం వల్ల మావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.
వరంగల్ నగర నూతన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
త్వరలో జరగనున్న వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేస్తానని సీపీ స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్టాలు ఉండటం వల్ల మావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
ఇదీ చదవండి:తెలంగాణకు ఆ సామర్థ్యం ఉంది: గవర్నర్