తెలంగాణ

telangana

ETV Bharat / state

Swetharka Mula Ganapathi Temple Kazipet : తెల్లజిల్లేడు చెట్టు వేరుతో వినాయకుడి రూపం.. కాజీపేటలో శ్వేతార్క గణపతిగా కొలువైన లంబోదరుడు - శ్వేతార్క గణపతి స్వామి ఆలయం

Swetharka Mula Ganapathi Temple Kazipet : గణపతి, గణనాధుడు, విఘ్నేశ్వరుడు, మూషికనాథుడు, లంబోధరుడు.. ఇలా వినాయకుడికి అనేక పేర్లు. మరెన్నో రూపాలు.. మరే దేవతా మూర్తిలోనూ ఇన్ని కనిపించవేమో. తెల్లజిల్లేడు చెట్టు వేరు గణపతి ఆకృతి దాల్చి.. కాజీపేటలో శ్వేతార్క గణపతిగా పూజలందుకుంటున్నాడు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. ఈ ఆలయం గణనాథుని నామస్మరణలతో మారుమోగుతోంది.

Swetharka Ganapathi in Kazipet
Swetharka Ganapathi

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 9:57 AM IST

Swetharka Ganapathi in Kazipet శ్వేతార్క గణపతికి నిత్యం పూజలు వినాయకుడి నామస్మరణలతో మార్రోగిన ఆలయం

Swetharka Mula Ganapathi Temple Kazipet :విఘ్నాలను తొలగించే నాయకుడు.. వినాయకుడు(Vinayakudu). ఏ పూజ చేసినా ఏ కార్యం తలపెట్టినా.. ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగేందుకు.. గణనాథుని అర్చించడం సంప్రదాయంగా వస్తోంది. రాతిని గణపతి రూపంలో చెక్కి ఆలయాల్లో ప్రతిష్ఠించడం.. అందరికీ తెలిసిన విషయమే. కానీ తెల్లజిల్లేడు వృక్షం వేరే.. వినాయకుడి సంపూర్ణ రూపంగా ఉద్భవించి.. లక్షలాది మంది భక్తుల చేత పూజలందుకోవడం ఆశ్చర్యమే.

Kazipet Swetharka Mula Ganapathi Temple :కాజీపేట ఆలయంలో కొలువైన శ్వేతార్క గణపతిస్వామి(Swetharka Ganapati Swami).. భక్తుల పాలిట కొంగుబంగారంగా ప్రసిద్ధికెక్కాడు. కేవలం కొబ్బరి కాయ, గరికతో స్వామివారిని పూజించి ప్రదక్షిణలు చేస్తే.. కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు.. వచ్చి స్వామిని దర్శించికుంటారు. మొదట్లో స్వామి నిజరూపానికే పూజలు చేసినా.. పద్దెనిమిదిన్నర కిలోల వెండి కవచాన్ని స్వామికి ధరింపచేసి అర్చకులు అభిషేకాలు చేస్తున్నారు.

Khairatabad Ganesh 2023 : శ్రీదశ మహావిద్యాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడి దర్శనం.. మొదలైన భక్తుల కోలాహలం..

'శ్వేతార్కం అంటే ఒక తెల్లజిల్లేడు చెట్టు వేరు మొదలులో ఉద్భవించడం అని అర్థం. గణపతి ఆకృతి ఏవిధంగా ఉంటుందో.. అలా తనాంతట తానుగా తయారు కావడం అనేది విశేషం. సహజంగా 100 ఏళ్లు వెళ్లిన తెల్లజిల్లేడు వృక్షానికి ఇటువంటి రూపాలు దొరికే అవకాశం ఉంది. ఏ చెట్టుకైన వేర్లు తొండాలు లాగే కనిపిస్తాయి. ఇక్కడ విశేషం ఏంటంటే అవయవాలు పరిపూర్ణంగా ఉంటాయి. రెండు నేత్రాలు, నుదురు, తొండం, దంతాలు, పాదాలు, మూషికం, అభయముద్ర ఇవన్నీ కూడా కలిసి ఉండడం అనేది ఇక్కడ విశేషం.' -అనంత మల్లయ్య సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు

Ganesh Chaturthi Festival Telangana 2023 :భక్తులే దాతలుగా మారి ఆలయాన్ని నిర్మించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందడంతో పలుచోట్ల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అన్నిచోట్లా 9 రోజులు నవరాత్రులు జరిగితే ఇక్కడ 13 రోజుల పాటు జరుగుతాయి. వినాయక చవితి(Ganesh Chaturthi 2023) పర్వదినం రోజున, సంకట హరచతుర్థి, ఇతర పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

'వినాయకుడిని మేము 31 ఏళ్ల నుంచి పెడుతున్నాం. మేము వినాయకుడిని చాలా నమ్ముతాం. శ్వేతార్క గణపతికి ఎప్పుడు పూజలు చేస్తాం. ఈ గణపతి అంటే మాకు చాలా ఇష్టం. స్వామి వారి దర్శనానికి వస్తే.. బాధలు అన్ని మరిచిపోతాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది.. స్వామి వారిని ఎప్పడెప్పుడు దర్శింకోవలా అని అనుకుంటూ ఉంటాను. శ్వేతార్కం అంటే మాకు నమ్మకం. ఎన్ని పనులు ఉన్న వాటిని ఆపుకొని ముందు గణపతిని దర్శించుకుంటాం. ఇక్కడకు రాగానే అన్ని మైమరిచిపోతాం. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మాకు ఈ శ్వేతార్కం దర్శనం.'-భక్తులు

Ganesh Chaturthi Telangana 2023 : వచ్చాడయ్యా.. గణపయ్యా.. తెలంగాణలో వినాయక చవితి సందడి షురూ

Ganesh Chaturthi 2023 : మానవ కోటికి వినాయక చవితి చాటి చెప్పే సందేశం ఏమిటి?

ABOUT THE AUTHOR

...view details