వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కొవిడ్ టీకా కోసం ప్రజలు బారులు తీరారు. హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్లో సూపర్ స్ప్రెడర్ల ((Super spreaders)కు టీకాలు వేస్తున్నారు. ఉదయం పది దాటినా వ్యాక్సిన్ వేయకపోవడంతో ప్రజలు ఎదురు చూశారు. గంటల కొద్ది క్యూలో నిల్చొని పడిగాపులు కాస్తున్నారు.
Vaccination : కరోనా టీకా కోసం సూపర్ స్ప్రెడర్ల పడిగాపులు - covid vaccination in warangal urban district
కరోనా వ్యాక్సిన్ కోసం రాష్ట్రమంతా ప్రజలు నిరీక్షిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఉదయం 10 దాటినా టీకా వేయకపోవడంతో సూపర్ స్ప్రెడర్లు (Super spreaders) ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం తెల్లవారుజాము నుంచి ఎదురుచూస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్, హన్మకొండలో కొవిడ్ వ్యాక్సినేషన్
ఉదయాన్నే పెద్దఎత్తున టీకా కోసం వచ్చిన వారితో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు భౌతిక దూరం సంగతే మర్చిపోయారు. ఓవైపు వైరస్ విజృంభిస్తోంటే.. కరోనా నిబంధనలు ఉల్లంఘించడమేంటని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంగణమంతా గందరగోళంగా మారడం వల్ల సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రారంభించారు.