వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని ఇద్దరు ఉన్నతాధికారులను రెండు రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు అధికారులను ఒకేసారి ఆకస్మిక బదిలీ చేశారు.
భూవివాదం విషయంలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలతో వరంగల్ ఎసీపీ సారంగపాణి, ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకేసారి ఇద్దరిని అటాచ్ చేయడం పట్ల పోలీసు శాఖలో ఆ అంశం పట్ల ఆసక్తి కొనసాగుతోంది.