శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వరంగల్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగాయి. హన్మకొండలోని వెంకటరమణ కాలనీ, సమ్మయ్య నగర్, విండోస్ కాలనీలకు భారీగా నీరు చేరింది. ఇళ్ల మధ్య నుంచి నీరు వాగులా ప్రవహిస్తుండడం వల్ల కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంట్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వరంగల్లో నీట మునిగిన కాలనీలు - Warangal
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
![వరంగల్లో నీట మునిగిన కాలనీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4025904-353-4025904-1564799959968.jpg)
వరంగల్లో నీట మునిగిన కాలనీలు