KU students protest: వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. వర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూలో వసతి కల్పించాలని కోరుతూ పరిపాలన భవనం ఎదుట విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన తెలిపారు.
వసతి గృహాలు ఖాళీ చేయాలని వీసీ ఆదేశం..
వచ్చే నెల ఐదో తేదీ లోపు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న విద్యార్థులు వసతి గృహలను ఖాళీ చేయాలని కేయూ ఉపకులపతి ఆచార్య రమేష్ ఆదేశించారు. దీంతో భగ్గుమన్న విద్యార్థులు నిరసనకు దిగారు. తమకు హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. వీరికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. కేయూ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కేయూ అధికారులు వసతి కల్పిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కేయూలో విద్యార్థుల ఆందోళన ఇదీ చూడండి: