వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పరిపాలన భవనం ముందు ధర్నా చేశారు. అవకతవకలకు పాల్పడిన అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో భవనం అద్దాలు ధ్వంసం కాగా ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
కాకతీయ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన - students
డిగ్రీ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. లోపలికి వెళ్లేందుకు యత్నంచిగా పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది.
![కాకతీయ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4030523-thumbnail-3x2-ku.jpg)
విద్యార్థులు