వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కరోనా ఉద్ధృతి కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో వసతి గృహాలను మూసివేయడం నిరసిస్తూ.. అధిక సంఖ్యలో విద్యార్థులు నిరసనకు దిగారు. పరిపాలన భవనం ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన
కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. వసతి గృహాలను మూసివేయడం నిరసిస్తూ.. అధిక సంఖ్యలో విద్యార్థులు నిరసనకు దిగారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో రాని కరోనా ఇప్పుడు ఎలా వస్తుందని విద్యార్థులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల లబ్ధి కోసమే విశ్వవిద్యాలయాలు తెరిపించి..ముగియగానే మళ్లీ విశ్వవిద్యాలయాలను మూసి వేయడం ఎంతవరకు సబబని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను తెరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి అధికారులు వసతి గృహాలను ఎలా ముస్తారని అని ప్రశ్నించారు.
- ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 47 వేల మందికి వైరస్