'సిలబస్ పూర్తి చేయకముందే పరీక్షలు ఎలా పెడతారు' - kaktiya unversity
సిలబస్ పూర్తి కాకముందే పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
'సిలబస్ పూర్తి చేయకముందే పరీక్షలు ఎలా పెడతారు'
డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పరీక్షల విభాగం ముట్టడించారు. సిలబస్ పూర్తి కాకముందే సెమిస్టర్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని కంట్రోలర్లను నిలదీశారు. అనంతరం ఎగ్జామినేషన్ కంట్రోలర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
TAGGED:
kaktiya unversity