తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యావ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు' - హన్మకొండలో విద్యార్థుల నిరసన

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలాని డిమాండ్ చేస్తూ హన్మకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

students dharna for scholarships  in hanmakonda
'విద్యావ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు'

By

Published : Feb 4, 2020, 4:01 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం నుంచి కాళోజి కూడలి వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

'విద్యావ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు'

పెండింగ్​లో వున్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత విద్యారంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇవీ చూడండి:మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్లు

ABOUT THE AUTHOR

...view details