హన్మకొండలోని వడ్డేపల్లి పింగళి కళాశాలలో యువతరంగ్ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొని జానపద గేయాలకు నృత్యాలు చేశారు.
డాన్సులతో దుమ్మురేపిన విద్యార్థులు - warangal urban district news today
వరంగల్లో విద్యార్థులు నృత్యాలతో అదరగొట్టారు. వడ్డేపల్లి పింగళి కళాశాలలో నిర్వహించిన యువతరంగ్ కార్యక్రమంలో విద్యార్థులు ఆనందంతో స్టెప్పులు వేస్తూ అదరహో అనిపించారు.
ఆనందంతో స్టెప్పులు వేసిన విద్యార్థులు
ఒకరికొకరు పోటీ పడి డ్యాన్సులతో సందడి చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి యువతరంగ్ కార్యక్రమాలు ఎంతోగానో ఉపయోగ పడతాయని కళాశాల నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..
Last Updated : Jan 31, 2020, 7:25 PM IST
TAGGED:
yuva tharangam