వరంగల్ నగరంలో ఎక్కడ చూసినా జయహో సజ్జనార్ అనే నినాదాలు మారు మోగుతున్నాయి. దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల హన్మకొండలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ చిత్రపటాలు పట్టుకొని సంబురాలు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆడ పిల్లలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించాలంటే భయపడేలా చేయాలని విద్యార్థులు కోరారు.
'ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడానికి భయపడాలి' - వరంగల్లోని పాఠశాల విద్యార్థుల సంతోషం
దిశ హత్య కేసులోని నిందితులకు పోలీసులు సరైన గుణపాఠం చెప్పారంటూ వరంగల్లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సీపీ సజ్జనార్ చిత్ర పటాలతో హోరెత్తించారు.
'ఇక నుంచి ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి భయపడాలి'