వరంగల్ అర్బన్ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఉస్మానియ విశ్వవిద్యాలయం కంటే కాకతీయలో ప్రవేశాల ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వీసీ, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులకు నచ్చేచెప్పేందుకు ప్రయత్నించినా వారు ఖాతరు చేయలేదు. వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి ఫీజుల తగ్గించాలని నినాదాలు చేశారు. లేని పక్షంలో ఆందోళనని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రవేశాల ఫీజుల వెంటనే తగ్గించండి: కేయూ విద్యార్థులు - విద్యార్థులు ఆందోళన
ప్రవేశాల ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులు వీసీ ఛాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. ఫీజుల తగ్గించేవరకు ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు.
అధిక ఫీజులపై కేయూలో ఉద్రిక్తత