తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2021, 5:32 PM IST

ETV Bharat / state

'నియామకాలు లేవు కానీ.. ఉద్యోగులకు వయోపరిమితి పెంపు'

వరంగల్​లో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచడాన్ని నిరసిస్తూ కరీంనగర్ ప్రధాన రోడ్డుపై ధర్నా చేశారు. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

వరంగల్​లో విద్యార్థి సంఘాల ఆందోళన
వరంగల్​లో విద్యార్థి సంఘాల ఆందోళన

ఉద్యోగులకు పీఆర్సీ పెంచడాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తున్నామని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

విద్యార్థులకు నియామకాలు చేపట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో వారు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఉద్యోగుల వయోపరిమితి పెంచటంపై వరంగల్​లో ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తు హన్మకొండలోని కరీంనగర్ ప్రధాన రోడ్డుపై ఏబీఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆందోళనతో ట్రాఫిక్ జాం కావడంతో... పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:'ఉద్యోగ విరమణ వయస్సు పెంచటం అన్యాయం'

ABOUT THE AUTHOR

...view details