తెలంగాణ

telangana

ETV Bharat / state

జేఎన్​యూ ఘటన నిరసిస్తూ ఆందోళన - student unions protest against jnu incident

వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అండతో ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

జేఎన్​యూ ఘటన నిరసిస్తూ ఆందోళన
జేఎన్​యూ ఘటన నిరసిస్తూ ఆందోళన

By

Published : Jan 6, 2020, 9:52 PM IST

దిల్లీ జేఎన్​యూలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ... వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్​ఎఫ్​, ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. కేంద్రం అండతో ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

జేఎన్​యూ ఘటన నిరసిస్తూ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details