Student Suicide in Narsampet Online Betting :కాయ్ రాజా.. కాయ్.. వంద పెట్టండి వెయ్యి గెలుచుకెళ్లండి. ఒకప్పుడు ఎక్కడో సందుగొందుల్లో గుట్టుగా జరిగే ఈ బెట్టింగ్ వ్యవహారం.. ఇప్పుడు పలు యూట్యూబ్ ఛానళ్లు(YouTube Channels), వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌ల రూపంలోనూ అమాయకుల జేబులు కొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో తారసపడుతూ వస్తున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలను (Bank accounts) ఖాళీ చేస్తున్నాయి. బెట్టింగ్‌ల (Online Betting ) మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే.. నష్టపోయిన మరికొందరు యువకులు.. అడ్డదారులు తొక్కుతూ మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఈ తరహా మోసాలు సామాన్య ప్రజలను కలవర పెడుతున్నాయి.
Boy Suicide in Narsampet :నేటి ఆధునిక కాలంలో యువత ఆలోచన ఎలా ఉందంటే.. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనేఆన్‌లైన్ బెట్టింగుల్లో పెట్టుబడులు పెడుతూ క్రమంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే వారిలో 18-40 ఏళ్ల వయసున్న వారే అధికంగా ఉంటున్నారు. స్నేహితుల మూలంగా, చరవాణి సహకారంతో చిన్నగా, సరదాగా ప్రారంభమైన ఈ మహమ్మారి.. ఇల్లుగుల్ల చేసేవరకు విడిచిపెట్టడం లేదు. వాటి నుంచి తేరుకునే సరికి పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. దీని ఫలితంగా వారిని నమ్ముకున్న కుటుంబీకులు దుఃఖ పీడితులు అవుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పు చేసిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. వారి ఖాతాల్లోని రూ.24 కోట్లు సీజ్