తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాడు రాష్ట్రం కోసం నేడు ఉద్యోగాల కోసం ఆగని బలిదానాలు'

నాడు రాష్ట్రం కోసం విద్యార్థులు బలిదానాలు చేశారని.. నేడు ఉద్యోగాల కోసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ నాయక్​ది ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు.

student federation protest , protest in warangal
వరంగల్​లో విద్యార్థుల ధర్నా, ఉద్యోగాల కోసం విద్యార్థుల ధర్నా

By

Published : Apr 7, 2021, 4:36 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలు ప్రకటించకుండా ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయని ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు దీక్ష శిబిరాన్ని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.

బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల కోసం బలిదానాలు చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని వాపోయారు. విద్యార్థులు చేపట్టిన ఈ దీక్షలకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి.

ఇదీ చదవండి:యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details