తెలంగాణ

telangana

ETV Bharat / state

'విగ్రహ కూల్చివేత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' - HYDERABAD AMBEDKAR STATUE

హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చడం పట్ల షెడ్యూల్డ్ కుల సంఘాలు ఆందోళనలు ఉద్ధృతం చేశాయి.  తక్షణమే అంబేడ్కర్ విగ్రహాన్ని పున ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.

మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయాలి : ఎమ్మార్పీఎస్

By

Published : Apr 23, 2019, 12:08 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్​లో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద షెడ్యూల్డ్ కుల సంఘాలు నిరసన చేపట్టాయి. విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేసిన వారిని శిక్షించకుండా... ప్రశ్నించిన మందకృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయాలని కోరారు.

షెడ్యూల్డ్ కుల సంఘాల ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details