వరంగల్ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్పూర్తిని కనబరిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొన్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా ఆంక్షలు అమలు చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యారని మంత్రి కొనియాడారు.
ఓటర్లు ప్రజాస్వామ్య స్పూర్తిని కనబరిచారు: మంత్రి ఎర్రబెల్లి
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఆశించిన మేర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ విజయవంతంగా జరగడానికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ వరంగల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఆశించిన మేర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అధికారుల సమన్వయంతోనే కరోనా సంక్షోభంలోనూ పోలింగ్‌లో పాల్గొన్నారన్న ఆయన.. ఇది ప్రజస్వామ్యవాదుల విజయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటింగ్ విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
ఇదీ చదవండి:'పదవిని కాపాడుకోవాలనే ఆరాటంతోనే కేంద్రంపై ఈటల విమర్శలు'