ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులపై హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
'ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి' - పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు
ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రభుత్వం పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వరంగల్లో విజ్ఞప్తి చేశారు.
'ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి'
పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు. ప్రైవేట్వి వస్తే... ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపైనా తీవ్ర ప్రభావం పడనుందని హెచ్సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:రూటు మార్చిన గొలుసు దొంగలు..