తెలంగాణ

telangana

నిరాడంబరంగా శ్రీ శ్వేతార్క మూలగణపతి ఉత్సవాలు

By

Published : Aug 22, 2020, 12:51 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి ఆలయంలో ఉదయం నుంచే అర్చకులు గణనాథునికి విశేషపూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు లేకుండానే పూజా కార్యక్రమాలు చేశారు.

Sri Shwetarka Mahaganapati celebrations in Warangal district
నిరాడంబరంగా శ్రీ శ్వేతార్క మూలగణపతి ఉత్సవాలు

వినాయక చవితిని పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. ఐనవోలు అనంత మల్లయ్య శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించారు. అనంతరం పంచామృతాలు, నవవిధ ఫలరసాలు, ద్వాదశ వర్ణాలతో అభిషేకాలు నిర్వహించి స్వామివారిని శ్వేతార్క మహాగణపతిగా అలంకరించారు.

నిరాడంబరంగా శ్రీ శ్వేతార్క మూలగణపతి ఉత్సవాలు

ఏకవింశతి పత్రి పూజ, సహస్ర మోదక కుడుములు నైవేధ్యంగా సమర్పించారు. గణపతి ఉత్సవాలను 16 రోజుల పాటు నిర్వహించడం ఈ ఆలయంలో ప్రత్యేకత. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు లేకుండానే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైరస్ ప్రాబల్యాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం తగు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఇవీచూడండి: వినాయకుని రూపం వెనుక పరమార్థం ఇదే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details