ఓరుగల్లు వాసుల ఇంటిదైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అన్నపూర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
రెండోరోజు అన్నపూర్ణగా శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం - warangal city news
వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు కనులపండుగగా జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
రెండో రోజు అన్నపూర్ణగా శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం
ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆలయంలో శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక వాహన పూజలు నిర్వహించారు.