వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో మార్చి 27 నుంచి 3రోజుల పాటు స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన థీమ్ వీడియోను కళాశాల సంచాలకుడు ఎన్వీ రమణారావు తెలిపారు. 'మిథీహాస్' అనే పేరుతో ఈ సంవత్సరం వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విద్యార్థులే నిర్వాహకులుగా మారి నిర్వహించే ఈ వేడుకల్లో వివిధ సంస్కృతుల మేళవింపుగా 55 రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
వరంగల్ నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు - WARANGAL
వరంగల్ నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు సిద్ధమవుతోంది. విద్యార్థులే నిర్వాహకులుగా 'మిథిహాస్' అనే పేరుతో ఈసారి వేడుకలను నిర్వహిస్తున్నట్లు కళాశాల సంచాలకుడు ఎన్వీ రమణారావు తెలిపారు.
వరంగల్ నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు
విద్యార్థులు ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారిలోని ఒత్తిడి తగ్గి కళాత్మక నైపుణ్యాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. ఈ వేడుకలకు దేశం నలుమూల నుంచి వివిధ కళాశాలలకు చెందిన సుమారు 3000 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి:పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..