వరంగల్‌లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అతివేగంగా వెళ్తున్న వాహనాల వేగాన్ని గుర్తించేందుకు సీపీ విశ్వనాథ్ రవీందర్ స్పీడ్ లెజర్ గన్స్‌ను ప్రారంభించారు. అతివేగంగా వెళ్లే వాహనదారులను గుర్తించి చలానా విధించడం జరుగుతుందని సీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 6 లక్షలకుపైగా వాహనాలు నిత్యం రోడ్లపై తిరుగుతున్నాయన్నారు.
వరంగల్‌లో స్పీడ్ గన్ల ఏర్పాటు - cp
అన్నింటికంటే విలువైనది మనిషి ప్రాణం. అటువంటి ప్రాణాన్ని అతివేగం కారణంగా కోల్పోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా స్పీడ్ లెజర్ గన్స్ ఏర్పాటు చేశారు.
సీపీ విశ్వనాథ్ రవీందర్
ఇవీ చూడండి:'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'