ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించిన దృష్ట్యా... వరంగల్ ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో కేసు నమోదు కావటం వల్ల ఎంజీఎంలో 25 పడకలతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఒక నోడల్ అధికారితో పాటు మెడికల్ అధికారి, సిబ్బందిని నియమించారు.
కరోనా ఎఫెక్ట్: ఎంజీఎంలో 25 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు - CORONA CASES IN TELANGANA
రాష్ట్రంలో కరోనా ప్రవేశించగా... అన్ని ఆస్పత్రులు అప్రమత్తమయ్యాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా లక్షణాలున్న రోగుల కోసం 25 పడకలతో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు.

SPECIAL WARD IN WARANGAL MGM HOSPITAL FOR CORONA PATIENTS
వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఉత్తర తెలంగాణకు తలమానికమైన ఎంజీఎం ఆస్పత్రికి... ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వచ్చే అవకాశం ఉండగా... ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: ఎంజీఎంలో 25 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు