వరంగల్ జిల్లా హన్మకొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న ప్రాచీన సిద్ధభైరవస్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిద్ధుల గుట్టగా పేరొందిన కొండపైన ఉన్న ఈ ఆలయానికి వెళ్లాలంటే.. కాస్త శ్రమించాల్సిందే. రెండువందలపైగా మెట్లు ఎక్కితేనే.. కాలభైరవ స్వామి దర్శనం భక్తులకు లభిస్తుంది. పెద్ద పెద్ద రాళ్ల మధ్యనుంచి... చిన్న తోవ గుండా వెళ్లాల్సి ఉంటుంది.
ఆధ్యాత్మిక ఆనందం..
కొండపైన కొలువైన కాలభైరవస్వామిని చూసి... భక్తులు పరవశించిపోతారు. అప్పటివరకూ కలిగిన శ్రమను మరిచిపోతారు. అంతులేని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. దూర ప్రాంతాలనుంచి సైతం భక్తులు వచ్చి... కాలభైరవుడిని దర్శించుకున్నారు. శివరాత్రితోపాటు... ఇతర పర్వదినాల సందర్భంగా ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. కాలభైరవ నామస్మరణతో మారుమోగుతాయి.