తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి' - 'పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి'

వరంగల్ నగరంలో నిర్వహిస్తున్న శానిటేషన్ డ్రైవ్ లో అందరూ పాల్గొనాలని మేయర్ గుండా ప్రకాశ్ సూచించారు. ఈ డ్రైవ్ లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చేసేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని మేయర్ కొనియాడారు.

'పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి'
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి'

By

Published : Jun 1, 2020, 3:25 PM IST

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాశ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల ఎనిమిదో తేదీ వరకు శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

నగరంలోని కాలనీలతో పాటు రహదారులపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చూపించారు. మురికివాడల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం సహా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తామని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్​లలో నలభై రెండు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారని.. ఐదు డివిజన్లకు కలిపి ఒక స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ బారిన పడకుండా నగరవాసులకు భరోసా కల్పించిన బల్దియా పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని గుండా ప్రకాశ్ కొనియాడారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details