కరోనా కట్టడికోసం వరంగల్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ శివాలయాల్లో కొవిడ్ నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. నమక చమకాదులతో, పంచామృతాభిషేకలు, నవ రసాలతో రుద్రాభిషేకాలు చేశారు.
కరోనా కట్టడి కోసం వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు - కరోనా కట్టడి కోసం వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రముఖ శివాలయాల్లో కరోనా నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైరస్ కట్టడి కోసం వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా నివారణ కోసం ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.
కరోనా కట్టడి కోసం వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు