వరంగల్ అర్బన్ జిల్లాలో 1,234 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి తెలిపారు. జిల్లాలో రికవరీ రేటు బాగా ఉందని తెలిపారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని.. వారంతా కోలుకుంటున్నారని వెల్లడించారు. ఇళ్లలో ఉండే సౌకర్యం లేకున్నా... వారిని కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం ఐసొలేషన్ ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.
'స్వీయ నియంత్రణ లోపించడం వల్లే కేసులు పెరుగుతున్నాయి'
వరంగల్ అర్బన్ జిల్లాలో స్వీయ నియంత్రణ లోపించడం వల్లే కేసులు అధికంగా వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి అన్నారు. కుటుంబంలో ఒకరికి వస్తే... మిగిలిన వారికీ వైరస్ సోకుతోందని తెలిపారు. అయినా వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను అరికట్టవచ్చని చెప్పారు.
CORONAVIRUS
ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయన్న దాంట్లో వాస్తవం లేదని... కాకతీయ వైద్య కళాశాలలో సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలు శుభకార్యాలు తగ్గించాలని, జనసమూహంలోకి వెళ్లడం పూర్తి మానుకోవాలని సూచించారు. అందరి సహకారంతోనే వైరస్ వ్యాప్తి కాకుండా అరికట్టగలమంటున్న జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
Last Updated : Jul 22, 2020, 11:41 PM IST