వరంగల్ అర్బన్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను జిల్లా కలెక్టర్ గాంధీ హన్మంతు ప్రారంభించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారి ఆరోగ్యం మెరుగయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు. కొవిడ్ పాజిటివ్‌తో ఇళ్లలో ఉన్నవారికి వైద్య సిబ్బంది రోజూ రెండు సార్లు ఫోన్ చేసి వారి పరిస్ధితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని చెప్పారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం.. ప్రత్యేక హెల్ప్‌లైన్ - హోం ఐసోలేషన్
వరంగల్ అర్బన్ జిల్లాలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితుల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించింది. ఆ ఏర్పాట్లను కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. కరోనా బాధితులకు ఈ హెల్ప్‌లైన్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
ఇంట్లో చికిత్స పొందుతున్నవారు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులో ఉంటాయని, కొవిడ్ లక్షణాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చని, ఏ సమయంలోనైనా వైద్యులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎం అండ్ హెచ్‌వో లలితాదేవి, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌వో మదన్ మోహన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు