వినాయక చవితిని పురస్కరించుకుని వరంగల్ నగరంలో గణపతి మండపాల నిర్వాహకులు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రియదర్శిని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. నగరంలోని ఓ మండపం వద్ద గణపతిని గరికతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గరికతో వినాయక రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక అలంకరణ, పూజలు - lord ganesha celebrations
గణేశ్ నవరాత్రుల సందర్భంగా... వరంగల్ నగరంలోని గణపతి మండపాల వద్ద విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. మండపాల వద్ద భక్తులు భౌతిక దూరం పాటించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక అలంకరణలు, పూజలు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... మాస్కులు ధరించిన భక్తులను మాత్రమే మండపంలోనికి అనుమతిచ్చారు నిర్వాహకులు. భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.