వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పాటల ద్వారా కరోనా వైరస్ కట్టడిపై అవగాహన కల్పిస్తున్నారు. హన్మకొండ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు నివేదిత, కళాకారుడు సారంగపాణి తమ పాటల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని విశ్రాంత ఉపాధ్యాయురాలు నివేదిత కోరారు. కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కళాకారుడు సారంగపాణి సూచించారు.
కరోనా కట్టడికి పాటల ద్వారా ప్రజా చైతన్యం - SONGS FOR THE AWARENESS ON CORONA VIRUS
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక పక్క ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి నిరోధకానికి చర్యలు తీసుకుంటోంది. మరో వైపు పాటల ద్వారా కొందరు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.
పాటలతో కరోనా వైరస్‌పై అవగాహన