కరోనా కష్టకాలంలో జర్నలిస్టులకు అండగా మేమున్నమంటు కొంతమంది దాతలు సహాయాన్ని అందిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన జర్నలిస్టులకు సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేసి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు.
జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేత - necessities to journalists
వరంగల్ అర్బన్ జిల్లాలో జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు ఓ సామాజిక సేవకురాలు. అంతే కాకుండా హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి మండలానికి చెందిన జర్నలిస్టులకు... నిత్యావసర సరుకులు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి మండలానికి చెందిన జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులను ఆమె పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులగా ఉంటూ నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేలా కృషి చేసే జర్నలిస్టులకు.. ఒక సామాజిక సేవకురాలిగా తన వంతు బాధ్యతతో ఈ సేవ చేస్తున్నానన్నారు.
రానున్న రోజుల్లో జర్నలిస్టులకు అన్ని విధాల సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మండలంలోని ముల్కనూర్‌లో ఇటీవల మెడికల్ షాప్ నిర్వహిస్తున్న భార్యాభర్తలు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి... వారికి కూడా నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయాన్ని అందించారు.