తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లు కోటను కప్పేసిన పొగమంచు - ఓరుగల్లు కోటను కప్పేసిన పొగమంచు

ఓరుగల్లులో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఉదయం 9 అయినప్పటికీ.. భానుడు మబ్బుల చాటున దాగి దోబూచులాడుతున్నాడు. తెల్లని పొగమంచు నడుమ శిల్పాలు మరింత మనోహరంగా కనిపిస్తున్నాయి. మైమరించే ప్రకృతి అందాలు చూసి నగరవాసులు పులకించిపోతున్నారు.

Snow in Qila Warangal Fort
ఓరుగల్లు కోటను కప్పేసిన పొగమంచు

By

Published : Dec 25, 2020, 3:07 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా ఖిలా వరంగల్ కోటలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. శిలలపై దట్టంగా కమ్ముకున్న పొగమంచు చూపరులను కట్టిపడేస్తోంది. సుందరమైన కాకతీయ శిల్పాల నడుమ తెల్లని పొగమంచు చేరి.. ఆ అందాలను మరింత మనోహరంగా మార్చేసిన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తున్నాయి.

సాధారణం కంటే 5 నుంచి 7డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. మరోవైపు భూపాలపల్లి- వరంగల్ ప్రధాన రహదారిపై పొగమంచు విపరీతంగా కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కోటలోని మంచు అందాలు

ఇదీ చదవండి:మన్యంలో మంచు వర్షం.. వణికిస్తున్న చలి

ABOUT THE AUTHOR

...view details