.
ఎస్ఎమ్ఎస్లో లంచం - messages
ప్రజారోగ్యశాఖ సంచాలకుడికే లంచం ఇస్తానన్నాడు ఓ ప్రబుద్ధుడు. వరుసబెట్టి సంక్షిప్త సందేశాలు పంపి విసిగించాడు. డీహెచ్ ఫిర్యాదు మేరకు సస్పెండయ్యాడు.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్టు గ్రేడ్- 2గా బత్తిని సత్యనారాయణగౌడ్ పనిచేస్తున్నాడు. మెడికల్ సోషల్ వర్కర్ పదోన్నతుల కోసం ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావుకు రూ.5 లక్షలు లంచంగా ఇవ్వాలనుకున్నాడు. అదేపనిగా ఆయన చరవాణికి మంగళవారం సందేశాలు పంపించాడు.
ఎవరిని నమ్మాలో తెలియక...
పదోన్నతుల పరంగా అన్యాయం జరిగిన వారికి మీరు చొరవ తీసుకోవాలని విన్నవించాడు. ఎవరిని నమ్మాలో తెలియక నేరుగా అడుగుతున్నానని మేసేజ్ పంపించాడు. ఇలా మూడు సందేశాలు పంపాడు.
ఈ వ్యవహారంపై ప్రజారోగ్య డైరెక్టర్ ఆగ్రహించారు. వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీఅయ్యాయి. అవినీతికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదనిహెచ్చరించారు.