తెలంగాణ

telangana

ETV Bharat / state

SMART LIBRARY: ఆధునిక గ్రంథాలయం.. పాఠకులకు ఓ వరం

ఇప్పుడంతా డిజిటల్ దునియా. సాంకేతికతను ఒడసిపట్టుకుని ఈ ప్రపంచమే డిజిటలైపోయింది. ఈ ఇస్మార్ట్ యుగంలో గ్రంథాలయాలకు వెళ్లేవాళ్లేందరని ప్రశ్న తలెత్తక మానదు.! కానీ..ఆ లైబ్రరీని మీరు చూస్తే.. ఒక్కసారైనా అడుగు పెట్టాలనుకోవడం ఖాయం. అక్కడి పుస్తకాలే కాదు గోడలు కూడా విజ్ఞానాన్ని నింపుతాయి. ఆధునిక హంగులతో, అద్భుతమైన చిత్రాలతో పుస్తకప్రియులకు వరంలా మారింది ఆ గ్రంథాలయం. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.

SMART LIBRARY
వరంగల్​లో ఆధునిక గ్రంథాలయం

By

Published : Aug 7, 2021, 5:03 AM IST

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రంథాలయం గోడలపై పుస్తకాల బొమ్మలను ఒక్కసారి చూడండి. ఈ లైబ్రరీ గోడలే పుస్తకాల షెల్ఫులుగా ఎంతందంగా పెయింట్ వేశారో కదా..! అలాగే పుస్తకాల మధ్యలో ఓ బాలిక కూర్చుని చదువుతున్నట్టు గీసిన చిత్రాన్ని చూస్తుంటే.. ఈ గ్రంథాలయానికి వెళ్లి మీకూ చదువుకోవాలనిపిస్తోంది కదూ..! అయితే వెంటనే వరంగల్​కు వెళ్లాల్సిందే.

స్మార్ట్​ సిటీ నిధులతో నిర్మాణం

ఇదెక్కడో కాదు.. ఓరుగల్లు నడిబోడ్డున సాహిత్య పరిమళాలు ఇలా విరబూశాయి. ఒడిషా డాటర్ ఆఫ్‌ స్టేట్ స్పూర్తితో ప్రాంతీయ గ్రంథాలయం ముఖ చిత్రాన్ని ఇలా వేశారు. రూ.2 కోట్ల 90 లక్షల స్మార్ట్ సిటీ నిధులతో ఈ గ్రంథాలయం నిర్మించారు. ఇక్కడ ఒకేసారి 500 మంది పుస్తకపఠనం చేసే విధంగా తీర్చిదిద్దారు. తెలుగు, ఆంగ్లం, హిందూ, ఉర్దూ భాషల్లో దాదాపు 70 వేల పుస్తకాలతో ఈ విజ్ఞాన మందిరాన్ని రూపొందించారు. కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నేలా సరికొత్త హంగులతో ఆధునీకరించారు.

గోడలు విజ్ఞానాన్ని పంచుతాయి

ఈ లైబ్రరీలో గోడలు కూడా విజ్ఞానాన్ని పంచుతాయి. దేశ భక్తిని చాటే చిత్రాలు, ప్రముఖుల వర్ణ చిత్రాలు, క్రీడాకారుల విజయాలు, ప్రముఖ కవులు, రచయితలు, దేశం కోసం ప్రాణాలర్పించిన కార్గీల్ వీరుల చిత్రాలు.. గోడలపై అనుభావాలతో కూడిన సూక్తులు ఆకట్టుకుంటున్నాయి.

ఆధునీకరణమైన వసతులతో కూడిన గ్రంథాలయం చాలా బాగుందని పాఠకులు చెబుతున్నారు. ప్రశాంత వాతావరణంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ప్రత్యేక క్యాబిన్లతో పాటు అన్ని రకాల వసతులున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధునీకరణమైన వసతులతో కూడిన ఈ వరంగల్‌ ప్రాంతీయ గ్రంథాలయం నిరుద్యోగులకు, పుస్తక ప్రియులకు ఒక వరంలా ఉండనుంది.

ఇదీ చూడండి:

నీటిపారుదలపై కేసీఆర్‌ సమీక్ష... ఆదివారం మరోసారి భేటీ

ABOUT THE AUTHOR

...view details