వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. భద్రకాళి బండ్‌ను ప్రారంభించిన అనంతరం హంటర్ రోడ్డులోని న్యూశాయంపేటలో ఏర్పాటు చేసిన సభలో మంటలు చెలరేగాయి.
మంత్రి కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి - కేటీఆర్ పర్యటనలో అగ్ని ప్రమాదం
వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. న్యూశాయంపేటలో ఏర్పాటు చేసిన సభలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.
![మంత్రి కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి fire accident in ktr meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11381013-thumbnail-3x2-ktr-rk.jpg)
fire accident in ktr meeting
మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయకర్ రావు, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ స్టేజీపైకి రాగానే తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. మందుగుండు నిప్పురవ్వలు ఎగిరి స్టేజిపైన ఉన్న మ్యాట్‌పై పడి మంటలు అంటుకున్నాయి. వెంటనే తేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి
ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్
Last Updated : Apr 12, 2021, 10:49 PM IST