ఆరో విడత హరితహారంలో భాగంగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్‌లో అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎంజే అక్బర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మియావాకి పద్దతిలో దగ్గరగా వివిధ వృక్ష జాతులకు చెందిన మొక్కలను తక్కువ విస్తీర్ణంలో నాటారు.
ఈ పద్ధతిలో నాటిన మొక్కలకు నీరు ఎక్కువగా అవసరం ఉండదని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా నాటిన మొక్కలు సంవత్సరం తిరిగేలోపు దట్టంగా పెరుగుతాయన్నారు. మియావాకి పద్దతిలో గత సంవత్సరం నాటిన మొక్కలను సీపీ సందర్శించారు. కేవలం 8 నెలల కాలంలోనే 6 ఫీట్లకు పైగా పెరిగిన మొక్కలు చిన్నపాటి అడివిని తలపించాయి.