తెలంగాణ

telangana

By

Published : Aug 20, 2021, 10:25 AM IST

Updated : Aug 20, 2021, 12:13 PM IST

ETV Bharat / state

Varalakshmi Vratam: ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో మహిళల వ్రతాలు

రాష్ట్రంలోని వివిధ ఆలయాలు శ్రావణ శోభను(sravana masam) సంతరించుకున్నాయి. శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం సందర్భంగా దేవాలయాల్లో వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. మహిళలు పట్టు వస్త్రాలు ధరించి... అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Sri Varalakshmi vratam, sravana masam
ఆలయాల్లో శ్రావణ శోభ, భక్తిశ్రద్ధలతో మహిళల ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్ధలతో మహిళల వ్రతాలు

వరలక్ష్మి వ్రతాన్ని(Sri Varalakshmi vratam) పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం(sravana masam) రెండో శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి... అమ్మవార్లను అలంకరించారు.

ప్రత్యేక పూజలు

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

వివధ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలను మహిళలు నిర్వహిస్తున్నారు. దేవాలయాల్లో కలశ పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతున్నాయి. మహిళలు వేకువజామునే నిద్రలేచి... పట్టు చీరలు ధరించి ఆలయాలకు తరలి వెళ్తున్నారు.

ఆలయాల్లో వ్రతాలు

భక్తిశ్రద్ధలతో వ్రతాలు

హన్మకొండ జిల్లా కేంద్రంలో శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేపట్టారు.

మహిళలతో కిటకిట

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయాలు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఆలయానికి వచ్చిన మహిళలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ పూజల్లో పాల్గొంటున్నారు.

భద్రకాళికి ప్రత్యేక పూజలు

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... మొక్కులు చెల్లిస్తున్నారు. అంతకుముందు అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

కుంకుమార్చనలు

శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు అమ్మవారిని స్వర్ణాభరణాలు, రకరకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మంథని నుంచే కాకుండా హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, తాంబూలాలు సమర్పిస్తున్నారు.

కుంకుమార్చన

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఇవాళ ఉదయం వేళలో మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సామూహిక వ్రతాలు

ఎలా చేస్తారు?

మహిళలంతా లక్ష్మీదేవిని శ్రద్ధగా స్మరించుకునే... శ్రావణ వరలక్ష్మీ వ్రతం శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. అప్పుడు కుదరని వారు తర్వాత వచ్చే వారాల్లోనూ చేసుకోవచ్చు. ఇది మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. అందుకే ఈ రోజు ఏ ఇంట చూసినా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. మహిళలు పట్టుచీరలు కట్టి, తలలో పూలు, కళ్ల నిండా కాటుక, పాదాలకు పసుపు పెట్టుకుని... వాయనాలు అందిస్తూ, అందుకుంటూ సందడి చేస్తారు. సౌభాగ్యం, సిరిసంపదలు ఇవ్వమని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు.

ఇదీ చదవండి:varalakshmi vratam: సౌభాగ్యం, సిరిసంపదలిచ్చే శ్రావణలక్ష్మి

Last Updated : Aug 20, 2021, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details