తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో స్వచ్ఛంద లాక్​డౌన్.. రోడ్లన్నీ వెలవెల - latest news of warangal urban

కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. వరంగల్​లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడికి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నారు.

shops self lock down in warangal urban
స్వచ్ఛందంగా లాక్​డౌన్​ను పాటిస్తున్న వరంగల్​ దుకాణ సముదాయాలు

By

Published : Jul 13, 2020, 7:40 PM IST

రాష్ట్ర వ్యాాప్తంగా రోజురోజుకు కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ తరణంలో వరంగల్ నగరంలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు.

నగరంలోని విశ్వకర్మ వీధి, పిన్న వారి వీధి, బట్టల బజారులోని నిత్యం వ్యాపార లావాదేవీలు జరిపే దుకాణాలు మూతపడ్డాయి. దీనితో ప్రధాన వీధులన్నీ బోసిపోయాయి. క్రయవిక్రయాలు జరిపేవారు లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వైరస్ కట్టడిలో భాగంగా తమవంతు బాధ్యతగా దుకాణాలు మూసేసినట్టు యజమానులు తెలిపారు.

ఇదీ చదవండి:హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ABOUT THE AUTHOR

...view details