శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో సామూహిక అనఘాష్టమి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి సంకల్పం మేరకు కోటి అనఘాష్టమి వ్రతం నిర్వహించుటకు శ్రీకారం చుట్టినట్లు ఆలయం ప్రధానార్చకులు తెలిపారు.
శివరాత్రి సందర్భంగా సామూహిక అనఘాష్టమి వ్రతాలు - వరంగల్ తాజా వార్త
మహా శివరాత్రి సందర్భంగా వరంగల్లోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో దత్తపీఠాధిపతి సంకల్పం మేరకు సామూహిక అనఘాష్టమి వ్రతాలను నిర్వహించారు.
సామూహిక అనఘాష్టమి వ్రతాలు
అనఘాష్టమి వ్రతం నిర్వహించి అమ్మవారిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ సామూహిక వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:మహా శివరాత్రికి ముస్తాబైన రామేశ్వరం