తెలంగాణ

telangana

ETV Bharat / state

చిటికెడు పెద్దపట్నం బండారి కోసం భక్తుల తోపులాట - SHIVARATRI JATHARA AT INVOLU MALLIKARJUNA TEMPLE

మహాశివరాత్రి ఉత్సవాలు వరంగల్​ అర్బన్​ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వరించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించి పెద్దపట్నం వైభవంగా సాగింది. బండారి తీసుకునేందుకు భక్తులు పోటెత్తారు.

SHIVARATRI CELEBRATIONS IN INAVOLU
SHIVARATRI CELEBRATIONS IN INAVOLU

By

Published : Feb 21, 2020, 10:55 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా సాగాయి. జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎత్తు బోనాలు, మల్లన్న పట్నాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం జరిగిన పెద్దపట్నం వైభవంగా సాగింది. పెద్దపట్నం బండారి తీసుకునేందుకు భక్తులు పోటీపడగా... స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. చిటికెడు బండారి తీసుకుంటే కోరుకున్న కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాగా... బారికేడ్లు తోసుకుని మరీ పోటెత్తారు.

చిటికెడు పెద్దపట్నం బండారి కోసం భక్తుల తోపులాట...

ఇవీ చూడండి :మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details