తెలంగాణ

telangana

ETV Bharat / state

వేయి స్థంభాల ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎప్పుడో తెలుసా? - ఈనెల 10-14 వరకు శివరాత్రి ఉత్సవాలు

హన్మకొండలోని ప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో ఈ నెల 10 నుంచి 14 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల గోడ పత్రికలను ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆవిష్కరించారు. వేడుకలను నాలుగు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Shivaratri celebrations at the Thousand Pillar Temple hanamkonda
వేయి స్థంభాల ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎప్పుడో తెలుసా?

By

Published : Mar 4, 2021, 1:29 AM IST

వేయి స్థంభాల ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎప్పుడో తెలుసా?

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో ఈ నెల 10 నుంచి 14 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ... అందుకు సంబంధించిన గోడపత్రికలను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు.

మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో సామూహిక రుద్రాభిషేకాలు, శివ కల్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. కరోనా సందర్భంగా నియమ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

ఇదీ చూడండి :ఆస్తి పన్ను వసూలు కోసం ప్రత్యేక అధికారులు

ABOUT THE AUTHOR

...view details