మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించటమే కాకుండా... నిర్భయ కేసు కూడా నమోదు చేస్తామని వరంగల్ షీ-టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. హన్మకొండలో వాకర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో షీ-టీమ్స్‌పై ఆవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం పబ్లిక్‌గార్డెన్‌లో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా షీ-టీంలు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. మహిళలెవరూ భయపడకుండా షీ-టీంకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
'మహిళల్లో భరోసా కల్పించటమే షీ-టీం లక్ష్యం' - SHE TEAMS AWERNESS RALLY IN HANMAKONDA
హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్‌లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు షీ-టీంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలంతా ధైర్యంగా షీ-టీంకు సమాచారమివ్వాలని పోలీసులు సూచించారు.
SHE TEAM AWARENESS PROGRAME IN HANMAKONDA