వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయ అర్చకులు నిత్యాహ్నికం, సుగంధ పరిమళ ద్రవ్యాలతో పూర్ణాభిషేకాలు, అగ్ని ప్రతిష్ట, భేరి పూజ, తదితర పూజాధికాలు నిర్వహించారు.
భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ఓరుగల్లు భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. రేపు అన్నపూర్ణ అలంకరణలో కనువిందు చేయనున్నారు.
భద్రకాళీ ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
కొవిడ్ నిబంధనలను అనుసరించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసినా.. భౌతిక దూరం పాటించకుండానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు ఉత్సవాల్లో భాగంగా నేడు ఆలయంలో వృషభ, మృగ వాహన సేవలను నిర్వహిస్తారు. రేపు అమ్మవారు అన్నపూర్ణ అలంకరణలో.. విజయదశమి పర్వదినం రోజున నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఇదీ చూడండి.. కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్