వరంగల్ నగరంలోని 25వ డివిజన్ కార్పొరేటర్ రిజ్వాన మసూద్ సమావేశాన్ని నిర్వహించి లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. 14 మంది అర్హులకు రూ. 13 లక్షల 76 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
వరంగల్లో షాదీముబారక్ చెక్కుల పంపిణీ - వరంగల్లో షాదీముబారక్ చెక్కుల పంపిణీ
వరంగల్ పట్టణం 25వ డివిజన్లోని లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులను కార్పొరేటర్ రిజ్వాన మసూద్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.
వరంగల్లో షాదీముబారక్ చెక్కుల పంపిణీ
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావొద్దని.. అత్యవసరమైన సమయాల్లో మాత్రమే రోడ్లపైకి రావాలని ఆమె సూచించారు. అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని తెలిపారు.