ప్రజలు తమ ఇంటి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని... అప్పుడే డెంగ్యూ, చికెన్‌గున్యా లాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన ఆదివారం పది గంటలకు పది నిమిషాలు పారిశుద్ధ్య కార్యక్రమంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు రాకుండా స్వీయజాగ్రత్తలు తీసుకోవాలి : వినయ్ భాస్కర్ - దాస్యం వినయ్‌భాస్కర్ స్వచ్ఛ కార్యక్రమం
వర్షాలు మొదలవడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సూచించారు. మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో హన్మకొండలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పాడుబడిన చెత్త కుండలను, తడి చెత్తను, మురికి నీటి గుంటలను శుభ్రం చేశారు. వర్షాలు మొదలైనందున ప్రజలెవరూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నివాస సముదాయాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఇదీ చూడండీ :ఎనభై ఏళ్ల వయసులో యోగాతో అదరగొడుతున్న బామ్మ