తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్ వరంగల్‌ క్రెడిట్‌ రేటింగ్​కు ఇండియా రేటింగ్ ఏజెన్సీ - గ్రేటర్ వరంగల్‌ క్రెడిట్‌ రేటింగ్​కు ఇండియా రేటింగ్ ఏజెన్సీ ఎంపిక

వరంగల్‌ మహా నగరపాలక సంస్థ క్రెడిట్‌ రేటింగ్‌ కోసం ఇండియా రేటింగ్‌ ఏజెన్సీ ఎంపిక అయ్యింది. ఈ మేరకు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు.

గ్రేటర్ వరంగల్‌ క్రెడిట్‌ రేటింగ్​కు ఇండియా రేటింగ్ ఏజెన్సీ ఎంపిక
గ్రేటర్ వరంగల్‌ క్రెడిట్‌ రేటింగ్​కు ఇండియా రేటింగ్ ఏజెన్సీ ఎంపిక

By

Published : Sep 19, 2020, 11:07 AM IST

మున్సిపల్ కార్పొరేషన్ల క్రెడిట్ రేటింగ్​లో భాగంగా వరంగల్ నగర పాలక సంస్థను ఇండియా రేటింగ్‌ కోసం ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో బల్దియా అధికారులతో సమావేశం నిర్వహించారు. క్రెడిట్‌ రేటింగ్‌ కోసం సేబి గుర్తింపు పొందిన ఏడు సంస్థలు దరఖాస్తు చేశాయి. పరిశీలించిన నిపుణుల కమిటీ ఇండియా రేటింగ్‌ సంస్థను ఎంపిక చేసింది.

నగర పాలక సంస్థలకు సంబంధించి..

రెండు నెలల్లో క్రెడిట్‌ రేటింగ్‌ పూర్తవ్వాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో కమిషనర్‌ పమేలా సత్పతి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. సీడీఎంఏ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో గల నగర పాలిక సంస్థలకు సంబంధించిన పరపతి, ఆస్తులు, అప్పులు, ఆదాయం వసూలు, బాండ్లు తదితర అంశాలపై రేటింగ్ ఇవ్వనుంది. ఎంత మేరకు క్రెడిట్ ఇవ్వవచ్చనే అంశాలపై 2 నెలల్లోగా అంచనా వేసి సెబీకి బల్దియా క్రెడిట్ రేటింగ్ సమర్పిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... మత్తడిపోస్తున్న చెరువులు

ABOUT THE AUTHOR

...view details