ఒక ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 9బ్యాగుల... ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. లక్షా 73వేలు ఉంటుందని అన్నారు.
అక్రమంగా నిల్వచేసిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - వరంగల్ జిల్లా తాజా వార్తలు
వరంగల్ పట్టణంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలుల దాదాపు రూ. లక్షా 73 వేలు ఉంటుందని తెలిపారు.
అక్రమంగా నిల్వచేసిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవాడకు చెందిన ఎరుకల సదానందం... ఇంట్లో వీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని, గుట్కా ప్యాకెట్లను మట్టెవాడ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినోద్‌కుమార్ లేఖ