తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టికల్ 370 రద్దుతోనే దేశానికి భద్రత' - మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్

దేశ భద్రత కోసమే ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్​కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేశారని మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ తెలిపారు. దేశ ప్రజలు ప్రధాని మోదీపై విశ్వాసం ఉంచాలని కోరారు.

మోదీ నిర్ణయం వల్ల కశ్మీర్ సమస్య తొలగి దేశ రక్షణ పటిష్ఠంగా ఉంటుంది : బాబు మోహన్

By

Published : Aug 5, 2019, 2:30 PM IST

జమ్మూ కశ్మీర్ సమస్య చాలా సున్నితమైందని మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ వరంగల్ అర్బన్ జిల్లాలో స్పష్టం చేశారు. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కాశీబుగ్గలో సభ్యత్వ నమోదు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబు మోహన్ ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో భారతీయులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
జమ్మూ కశ్మీర్​కు ప్రత్యేక హోదా వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నందునే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం చేసిందన్నారు. ప్రధాని మోదీ నూతనంగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల కశ్మీర్ సమస్య తొలగి దేశ రక్షణ పటిష్ఠంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మోదీ నిర్ణయం వల్ల కశ్మీర్ సమస్య తొలగి దేశ రక్షణ పటిష్ఠం : బాబు మోహన్

ABOUT THE AUTHOR

...view details